త్వరలో బీజేపీ ప్రజా మ్యానిఫెస్టో

త్వరలో బీజేపీ ప్రజా మ్యానిఫెస్టో
  • ప్రజాభిప్రాయంతో మ్యానిఫెస్టో రూపొందించాం
  • బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్

ముద్ర, తెలంగాణ బ్యూరో : అన్ని వర్గాల ప్రజాభిప్రాయ సేరణతో బీజేపీ మ్యానిఫెస్టో రూపొందించి, త్వరలో విడుదల చేయబోతున్నట్లు పార్టీ మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీల మాదిరిగా నాలుగు గోడల మధ్య మ్యానిఫెస్టోను బీజేపీ రూపొందించదని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణతో ప్రజాకర్షక మ్యానిఫెస్టోను విడుదల చేస్తామన్నారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ అంశాలను మ్యానిఫెస్టోలో చేరాలనే అంశంపై నేరుగా రైతుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ఎంపీ బండి సంజయ్ కార్యాలయంలో రైతులతో సమావేశమై అభిప్రాయాలను సేకరించామని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ తమకు పరిస్థితులు ఇబ్బందికరంగా మారినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు యువత, రైతుల అభిప్రాయాలను సేకరించామని, ఈనెల 5వ తేదీ లోపు కార్మికులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాల సేకరణను పూర్తి చేస్తామని ఎస్. కుమార్ చెప్పారు.