2014 నుంచే నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఈటల రాజేందర్

2014 నుంచే నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఈటల రాజేందర్

ముద్ర, తెలంగాణ బ్యూరో: కల్వకుంట్ల దొంగలు ఎప్పట్నుంచో తన ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఆరోపించారు. మంగళవారం మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే పార్టీ సొంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ మొదలైందని ఆరోపించారు.

2014 చివరి నుంచే ఫోన్ ట్యాపింగ్ మొదలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళితబిడ్డ తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుంచి ఎందుకు బర్తరఫ్ చేస్తున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు. అయితే తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కేసీఆర్ నుంచి సమాధానం వచ్చిందన్నారు. దీంతో అక్కడ నుంచి తామందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు గుర్తించామని ఈటల పేర్కొన్నారు.