Ponguleti Srinivas Reddy Comments ఇన్ని రోజులకు దొరల గడీ నుంచి విముక్తి కలిగింది: పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

Ponguleti Srinivas Reddy Comments ఇన్ని రోజులకు దొరల గడీ నుంచి విముక్తి కలిగింది: పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి
Ponguleti Srinivas Reddy Comments

ఇన్ని రోజులకు దొరల గడీ నుంచి విముక్తి కలిగిందన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి. ఇప్పటికైనా సస్పండ్​ చేయడం ఆనందంగా ఉందన్నారు. నన్ను సస్పెండ్​ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  నేను సీఎం కేసీఆర్​ను ప్రశ్నించింది వాస్తవం. జనవరి నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నా. ఇప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని సస్పెండ్​ చేశారు. బీఆర్​ఎస్​లో సస్పెన్షన్​లు ఉండవని ఒకరంటారు, దమ్ము, ధైర్యం ఉంటే మీరే రాజీనామా చేయాలని ఒకరంటారు.

నేను సభ్యుడినే కాదన్నప్పుడు ఎలా సస్పెండ్​ చేశారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఇప్పుడేం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ బిడ్డలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పారదర్శక పాలన అందించడం ప్రభుత్వ బాధ్యత. పాలేరు ఉప ఎన్నికలో గెలుపు కోసం నాపై ఒత్తిడి తెచ్చారు. మంత్రి కేటీఆర్​ నాతో అనేకసార్లు మాట్లాడారు. పార్టీలో నాకు సముచిత స్థానం కల్పస్తామని సీఎం హామీ ఇచ్చారు. కేసీఆర్​ మాటలు నమ్మి నేను బీఆర్​ఎస్​లో చేరానన్నారు.