ఏప్రిల్ 13 వ తేదీన చేవెళ్ల లో నిర్వహించ బోయే కేసీఆర్ చేవెళ్ల భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి. 

ఏప్రిల్ 13 వ తేదీన చేవెళ్ల లో నిర్వహించ బోయే కేసీఆర్ చేవెళ్ల భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి. 
  • చేవెళ్ల గడ్డపై మూడో సారి హ్యాట్రిక్ గా బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం
  •  చేవెళ్ల గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా ఎమ్మెల్యే గాంధీ 

ఏప్రిల్ 13 వ తేదీన చేవెళ్ల భారీ బహిరంగ సభ కోసం స్థానిక ఫరా ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ ను గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు,గౌరవ ఎమ్మెల్యేలు శ్రీ కాలే యాదయ్య గారు, శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణి దేవి గారు ,గౌరవ ఎంపీ అభ్యర్థి శ్రీ  కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు , మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు శ్రీ కార్తిక్ రెడ్డి గార్ల తో  కలిసి పరిశీలించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ

111 జీవో రద్దు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు తెచ్చిన ఘనత బీఆర్ ఎస్ సర్కారుకే దక్కుతుంది. సంక్షేమ పథకాలతో ప్రజలను కేసీఆర్ కాపాడుకుంటే..కాంగ్రెస్ 110 రోజుల పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లే కాంగ్రెస్ కడగండ్ల పాలనకు చెక్ పడి ప్రజలకు మేలు జరగాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను  గెలిపించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో మేలు పొందిన లబ్ధిదారులందరూ ఈ నెల 13న చేవెళ్లలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపు

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ గారు మాట్లాడుతూ 

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఏప్రిల్   13న చేవెళ్లలో పెద్ద ఎత్తున బహిరంగ సభ తలపెట్టడం జరిగినది అని , ఈ భారీ బహిరంగ సభ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఉద్యమకారులు ,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ,అభిమానులు భారీ గా తరలి వచ్చి సభ ను  విజయవంతం చేయలని ఎమ్మెల్యే గాంధీ గారు పిలుపునిచ్చారు.రాబోయే  పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్లపై మూడోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం, చేవెళ్ల ప్రాంత సుస్థిర  అభివృద్ధికి బాటలు వేసింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అని ఎమ్మెల్యే గాంధీ గారు తెలియచేసారు.

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో  బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని,ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామన్నారు.పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని ఆ ఇద్దరిని ఓడించటానికి  ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని,కేసీఆర్ గారిని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గాంధీ గారు పేర్కొన్నారు. 

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దాం అని, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజలలోకి వెళ్లాలని, ప్రతి గడప గడప కి వెళ్లి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ని వివరిస్తూ ఓట్లు అడుగుదాం అని ఎమ్మెల్యే గారు తెలియచేసారు. కేసీఆర్ గారు బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు అని , బీసీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారి  నిలబెట్టడం జరిగినది అని ఎమ్మెల్యే గాంధీ గారు తెలియచేసారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి ,సమిష్టి కృషి తో పని చేద్దాం ఎమ్మెల్యే గాంధీ గారు పిలుపునిచ్చారు.