టీటీడీపీలోకి మల్లన్న..

టీటీడీపీలోకి మల్లన్న..
teenmar mallanna joins tdp

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంపై చంద్రబాబు ఫోకస్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కాసాని జ్ఞానేశ్వర్‌ని టీడీపీలోకి తీసుకుని అధ్యక్షుడుగా నియమించారు. ఆయన అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి రాజకీయం మారింది. తెలంగాణలో టీడీపీ శ్రేణులు యాక్టివ్‌ అయ్యాయి. ఇక ఖమ్మంలో భారీ సభ ఏర్పాటు చేయడం..బాబు రావడం..మళ్ళీ మాజీ టీడీపీ నేతలు తిరిగి రావాలని కోరడం..పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఇక బాబు సభ తర్వాత తెలంగాణలో టీడీపీ మరింత దూకుడుగా వెళుతుంది. గ్రామ గ్రామానికి టీడీపీ శ్రేణులు వెళుతున్నాయి. ఇక కాసాని..ఇతర పార్టీల్లో ఉన్న మాజీ టీడీపీ నేతలని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు జిల్లాల్లో భారీ సభలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఊహించని విధంగా తీన్మార్‌ మల్లన్నతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ భేటీ అయ్యారని తెలిసింది.

రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం..కాసాని..మల్లన్నతో భేటీ అయి తాజా రాజకీయలపై చర్చిస్తున్నట్లు సమాచారం.మల్లన్నని టీడీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గతంలోనే మల్లన్నని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మల్లన్న సైతం క్లారిటీ ఇచ్చారు..టీడీపీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమే అని చెప్పుకొచ్చారు. తర్వాత మల్లన్న ఇండిపెండెంట్‌ గా ముందుకెళుతున్నారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చి రెండో ప్లేస్‌ లో నిలిచారు.తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో అరెస్ట్‌ అవ్వద, బెయిల్‌ విూద బయటకు రావడం..అక్కడ నుంచి కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం..మధ్యలో బీజేపీలో చేరడం..మళ్ళీ ఆ పార్టీకి కాస్త దూరం జరిగి..ఇండిపెండెంట్‌ గా ముందుకెళుతున్నారు. ఇదే తరుణంలో ఇప్పుడు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని..మల్లన్నతో భేటీ కావడం సంచలనంగా మారింది. మల్లన్న టీడీపీలోకి వస్తారనే ప్రచారం మొదలైంది. చూడాలి మరి మల్లన్న నిర్ణయం రాజకీయం ఎలా ఉంటుందో