రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రిని కలుద్దాం.. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి...

రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రిని కలుద్దాం.. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి...

ముద్ర ప్రతినిధి, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రం లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ సహేతుక మైందని, ఇందు కోసం త్వరలోనే ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావును  కలిసి విజ్ఞప్తి చేద్దామని ఉప్పల్ నియోజక వర్గం శాసన సభ్యుడు బేతి శుభాష్ రెడ్డి అన్నారు. రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రెడ్డి జె ఏ సీ ఆధ్వర్యంలో కీసర లో నిర్వహించిన మేడ్చల్ జిల్లా రెడ్డి ల ఆత్మీయ సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో నేటికీ రెడ్డికులం లోఎంతో మంది పేదలు ఉన్నారని వీరి సంక్షేమం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందు కోసం రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటుకై తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  రెడ్డిసంఘం ప్రతినిధుల తో కలిసి  త్వరలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గరికి వెళ్లి సమస్యను వివరిద్ధామని ఆయన తెలిపారు.

సేవా గుణం లోఎల్లప్పుడూ ముందుండే రెడ్డి లు  తమ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ ఎంతో కాలం నుండి పెండింగ్ లో ఉన్న రెడ్డి కార్పోరేషన్ ను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందు కోసం ప్రభుత్వాన్ని యాచించే కంటే ఆందోళన ను మరింత ఉధృతం చేసి కొట్లాడి సాధించుకోవాలని ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజేపి రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లా రెడ్డి, మర్రి మోహన్ రెడ్డి రెడ్డి జేఏసీ నాయకులు పైళ్ళ హరినాథ్ రెడ్డి,సత్యనారాయణ రెడ్డి, వసంత, రాఘవరెడ్డి, మధుకర్ రెడ్డి, పీసరి మల్లారెడ్డి , బండారి నీలం రెడ్డి తదితరుల తో పాటు జిల్లా లోని రెడ్డి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.