టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన వైఎస్​ఆర్​టీపీ  అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పేపర్‌ లీకేజీపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తూ  పార్టీ  శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో షర్మిలతో పాటు ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.  అంతకుముందు షర్మిల మాట్లాడుతూ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని.. చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ‘‘టీఎస్‌పీఎస్సీ ముందు ఆందోళన అంటే హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. బయటకు వెళ్లాలి అంటే ఇతర కారణాలు చూపించి నన్ను నిర్బంధిస్తున్నారు. నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులను మోహరించారు. నాకు లుక్‌ అవుట్‌ నోటీసులు ఇచ్చారు.. లుక్‌ అవుట్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి నేనేమైనా క్రిమినల్‌నా?’’ అని షర్మిల ప్రశ్నించారు.