మాదాపూర్ లో శ్వాస హాస్పిటల్ ప్రారంభం

మాదాపూర్ లో శ్వాస హాస్పిటల్ ప్రారంభం

ముద్ర, శేరిలింగంపల్లి: మాదాపూర్ కావూరి హిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్వాస హాస్పిటల్ ను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.  స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, ఇండియన్  జర్నలిస్ట్  యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్వాస క్లినిక్ యజమానులు డాక్టర్ విష్ణు రావు, డాక్టర్ వివేక్, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మధ్యకాలంలో అత్యంత ఎక్కువ ప్రమాదకరంగా  ముంచుకొస్తున్న  జబ్బులలో శ్వాస ఆరోగ్య సమస్య  ప్రధానమైనదని అన్నారు. అలర్జీ, ఆస్తమా వంటి జబ్బులు  రోజురోజుకూ అధికమవుతున్నాయని అన్నారు. పెరుగుతున్న  కాలుష్యం కారణంగా ఈ సమస్య తీవ్రమవుతున్నదని మంత్రి పేర్కొన్నారు. దీన్ని నయం చేయడమే కాకుండా భవిష్యత్తులో వాళ్ల కుటుంబాలలో ఎటువంటి సమస్యలు రాకుండా  చూడాలని ఆస్పత్రి వైద్యులను ఆయన కోరారు. హైదరాబాద్ లో దాదాపు  గత  25 సంవత్సరాలుగా తమదైన శైలిలో ఆసుపత్రి యాజమాన్యం సేవలందిస్తూ వస్తున్నదని మంత్రి ప్రశంసించారు.

శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ మాట్లాడుతూ మాదాపూర్  ప్రాంత ప్రజల సౌకర్యం కోసం శ్వాస ఆస్పత్రిని అందుబాటులోకి తేవడం సంతోషకరమని అన్నారు. సామాన్య ప్రజలకు సైతం తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆయన కోరారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.  సత్యనారాయణ  మాట్లాడుతూ  వారు గత 25 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయడమే కాకుండా డాక్టర్ విష్ణు రావు  ఎన్నో అవేర్ నెస్ క్యాంపులు, సెమినార్లు నిర్వహించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించిన చరిత్ర  వారికి ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు  నార్నె శ్రీనివాసరావు,  ఉప్పలపాటి శ్రీకాంత్ ,మాజీ కార్పొరేటర్  మాధవరం రంగరావు,  మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ శ్వాస హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.