నోట్ల రద్దు ఒక విఫల ప్రయోగం

నోట్ల రద్దు ఒక విఫల ప్రయోగం

హైదరాబాద్: బీజేపీ తీరుపై మంత్రి హరీశ్రావు  ఫైరయ్యారు. నోట్ల రద్దు ఒక విఫల ప్రయోగం అని మంత్రి వ్యాఖ్యానించారు.  హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ''నోట్ల రద్దు లక్ష్యం నెరవేరలేదు. నోట్ల రద్దు అట్టర్ ప్లాప్ ప్రోగ్రామ్ అని.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్  చెప్పకనే చెప్పారు. నోట్ల రద్దు తర్వాత ఫేక్ కరెన్సీ 54 శాతం పెరిగింది. నగదు చలామణి రెట్టింపు అయింది..

అవినీతి పెరిగింది. కేంద్రం చెప్పేదానికి..చేసేదానికి.. జరిగే దానికి పొంతన ఉండదు. డీమానిటైజేషన్ తో పెద్ద నోట్ల చలామణి తగ్గలేదు. చలామణిలో ఉన్న నగదుపై కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలే. జన్ధన్ ఖాతాలంటూ ప్రజలను మోసం చేశారు. టెర్రరిజం అదుపు కాలేదు, డ్రగ్స్ నియంత్రణ జరగలేదు''. అని హరీశ్రావు వ్యాఖ్యానించారు.