సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి...

సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి...
  • ప్రజలు సహకరించాలి - సిఐ మల్లేష్

శాయంపేట, ముద్ర : ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, రాజకీయ పార్టీ నాయకులు , ప్రజలు సహకరించాలని పరకాల సిఐ మల్లేష్  తెలిపారు.

మంగళవారం విలేకర్ల సమావేశంలో  మాట్లాడుతూ..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసిన, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభావాలకు గురిచేస్తే 100 కి కాల్ చేయాలని సూచించారు. ఓటర్లకి మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే పోలీసులకి సమాచారం అందించాలని చెప్పారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పోలింగ్ కేంద్రాల వద్ద నలుగురికి మించి ఉండకూడదని సూచించారు. పోలింగ్ కేంద్రం నుండి 200 మీటర్ల దూరంలో రాజకీయ నాయకులు బూతు ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఏ సమస్య తలెత్తిన పోలీసులకు సమాచారం అందించి సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. వ్యక్తిగత దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు