పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
  • 60 లక్షలతో నూతన గ్రామ పంచాయతీలకు శంకుస్థాపన
  • తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

చిట్యాల ముద్ర న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం కొత్తపేట ,లక్ష్మీపురం తండా, చల్లగరిగ, గ్రామాలలో 60 లక్షల రూపాయలతో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తపేట గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. చల్లగరిగ గ్రామపంచాయతీ సిబ్బందికి శాలువాలతో సన్మానించి ప్రశంస పత్రాలను అందజేశారు. అదే గ్రామంలోని ఆయుష్ హాస్పటల్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో పెద్దపీట వేస్తుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తండాలను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలన సౌలభ్యాన్ని అందిస్తుందన్నారు. పల్లెలలో 24 గంటల కరెంటు, గ్రామపంచాయతీ సిబ్బందితో పల్లెలను పరిశుభ్రంగా చేస్తూ, గ్రామంలోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తూ, గ్రామంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజల కోసం ప్రవేశపెడుతూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద, వీరారెడ్డి జెడ్పిటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్సి చైర్మన్ క్రాంతి కుమార్ రెడ్డి, సర్పంచులు కర్రే మంజుల, బానోత్ జవహార్ ,గజ్జి రవి ,పిఎసిఎస్ సి డైరెక్టర్లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు,  అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.