ఫుడ్ లో బొద్దింకలు

ఫుడ్ లో బొద్దింకలు
  • ఫుడ్ లో బొద్దింకలు  తో కలుషిత ఆహారం అందిస్తున్న వైన్స్ పర్మిట్ రూమ్ యాజమాన్యం.
  • కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైన్ యాజమాన్యం.
  • మందుబాబులు లబోదిబోమని అంటున్నారు.
  • మాకేం సంబంధం లేదంటున్న వైన్స్ యాజమాన్యం

ముద్ర న్యూస్ నేరేడుచర్ల:నేరేడుచర్ల  ఉమా రాఘవేంద్ర వైన్స్ పర్మిట్ రూంలో నాణ్యతలేని ఫుడ్ మందుబాబులకు అందిస్తున్నారు వైన్స్ పర్మిట్ రూమ్ లో మందుబాబులు ఆర్డర్ ఇస్తే గ్రీన్ ఫిష్ ఫ్రై లో బొద్దింకలు మిడతలు తో కలిసి ఆహారం తయారుచేసి కస్టమర్లకు ఇస్తున్నారు.

ఒక కస్టమర్ మందు తాగుతూ ఉంటే ఫుడ్ ఆర్డర్ చెబితే కలుషితమైన ఫుడ్ ఇచ్చి వైన్స్ భాయ్ వెళ్లిపోయారు కస్టమర్లు మందు తాగుతూ అవి తింటుంటే బొద్దింకల నోట్లోకి వెళ్లాయి ఏందని చూసుకునేసరికి నోట్లో బొద్దింకనేసరికి వాంతులు చేసుకున్నాడు.నాగేశ్వరరావు అనే కస్టమర్ మందుతాగుదామని వైన్ షాప్ కు వెళ్తే  ఫుడ్ ఆర్డర్ చెప్తే బొద్దింకలు ఉన్నాయి ఏందిరా బాబు అని అడిగితే నేను చూడలేదు అన్నా అని సమాధానం చెబుతున్నారు వైన్స్ పెట్టి వారం రోజులకే రెండుసార్లు ఇలాగే జరిగింది.దీనికి ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్లు గాని తనిఖీ చేసి పర్మిట్ రూం లోకనీస వసతులు చేయకుండా  ఇష్టఅనుసారంగా ఫుడ్ అందించడం వల్ల  ప్రజలకు ప్రాణా నష్టం కలుగుతుందని వైన్స్ లో మందుతాగే కస్టమర్లు చెబుతున్నారు.ఇకనైనా నాణ్యతలేని ఫుడ్ ఇవ్వకుండా వైన్స్ యాజమాన్యం పై అధికారులు స్పందించి తగు చర్య తీసుకోవాలని నాగేశ్వరావు శీను సైదులు అనే కస్టమర్ కోరుతున్నారు.