నేడు పురందేశ్వరి నామినేషన్ ...

నేడు పురందేశ్వరి నామినేషన్ ...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వీకే సింగ్ హాజరు కానున్నారు. నేడు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి తో సహా ముగ్గురు బీజేపీ నేతలు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం లోక్ సభ అభ్యర్థి గా నేటి మధ్యాహ్నం 1.30 గం లకు నామినేషన్ దాఖలు చేస్తారు.