అయోధ్యకు 1,11,111 కిలోల లడ్డూ ప్రసాదం సరఫరా

అయోధ్యకు 1,11,111 కిలోల లడ్డూ ప్రసాదం సరఫరా
శ్రీరాముడికి నివేదన చేయనున్న లడ్డూ ప్రసాదం

మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్):  అయోధ్య శ్రీరామ మందిరంలో భక్తులకు పంచేందుకు 1,11,111 కిలోల లడ్డూలను మీర్జాపూర్ కు చెందిన ఒక ఆశ్రమం సిద్ధం చేస్తోంది. ఈనెల 17న ఈ లడ్డూలను స్వామి వారికి నివేదించిన తర్వాత ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేయనున్నారు. దేవ్రహ హన్స్ బాబా ట్రస్ట్ కు చెందిన అతుల్ కుమార్ సక్సేనా ఈ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారు. ప్రతి వారం కూడా వివిధ ఆలయాలకు ఈ ట్రస్ట్ ద్వారా లడ్డూలు సరఫరా చేస్తుంటారు. కాశీవిశ్వనాథ్ ఆలయం, తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయాలకు కూడా లడ్డూ ప్రసాదం గతంలో పంపించినట్టు అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు.  అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవం రోజున జనవరి 22న దేవ్రహ హన్స్ బాబా ఆశ్రమ్ 40 వేల కిలోల లడ్డూలను స్వామివారికి నివేదించినట్టు ఆయన తెలిపారు.