‘హిడింబ’ మెమోరీస్ సాంగ్

‘హిడింబ’ మెమోరీస్ సాంగ్

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’.  ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం నుంచి 'మెమోరీస్ మెమోరీస్' అనే పాటని లాంచ్ చేశారు. వికాస్ బాడిశ మెస్మరైజింగ్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాటని యశస్వి కొండేపూడి, యాజిన్ నిజార్ లైవ్లీగా అలపించారు. విరించి పుట్ల సాహిత్యం అందించారు. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీని బ్యూటీఫుల్ గా చూపించారు. ఈ చిత్రానికి బి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎం ఆర్ వర్మ ఎడిటర్.