కాంగ్రెస్ పాలనతోనే పేదలకు న్యాయం 

కాంగ్రెస్ పాలనతోనే పేదలకు న్యాయం 
  • ఎన్కౌంటర్ల చరిత్ర శ్రీహరిది

ముద్ర, జఫర్‌గడ్ : కాంగ్రెస్ పాలనతోనే రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరా అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంతో పాటు, తమ్మడపల్లి( జి), షాపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రతి గ్రామంలో బ్రాందీ షాపులు, వాడవాడలా బెల్టు షాపులను తెరిచి తాగుబోతు తెలంగాణ చేసిన ఘనత కెసిఆర్ కి దక్కుతుందని ఆమె ఎద్దేవా చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశావని గొప్పలు చెబుతున్న కడియం శ్రీహరి గొప్పలే తప్ప అభివృద్ధి చేసిందు శూన్యమన్నారు. కడియం శ్రీహరి 30 ఏళ్ల రాజకీయ జీవితం, 15 ఏళ్ల రాజకీయ దర్పంతో కడియం శ్రీహరి ఎన్కౌంటర్ల చరిత్ర తప్ప నియోజకవర్గానికి ఒరగ పెట్టింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్నారు.

మాయ మాటలతో మభ్యపెట్టే బి ఆర్ ఎస్, బిజెపి మోసగాలను బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం తమ్మడపల్లి(జి) గ్రామానికి చెందిన బిఆర్ఎస్  కార్యకర్తలు నక్క నవీన్, వినయ్, అన్నెపు సాయిరాం, వేల్పుల రాజు, కత్తుల రాజు తో పాటు 20 మంది కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ట మనోజ్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బిక్షపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య,, పార్టీ అధ్యక్షులు నూకల ఐలయ్య, చిట్టి మల్ల కృష్ణమూర్తి, మైనార్టీ నాయకులు ముక్తార్ అలీ, నంచర్ల యాదగిరి, టి రాజేందర్ తోప