జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పూలే కు భారత రత్న ప్రకటించాలి..

జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పూలే కు భారత రత్న ప్రకటించాలి..
  • సామాజిక దార్శనికుడు..జ్యోతిరావు పులే..
  • విద్యతోనే సమసమాజ స్థాపన  సాధ్యం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన జ్యోతి రావు పులే, సావిత్రి భాయి పులే కు భారత రత్న అవార్డు ప్రకటించాలని జీవన్ రెడ్డి ప్రధాన మంత్రి మోడీకి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో కాంగ్రెస్ అధ్వర్యంలో జ్యోతి రావు పులే జయంతి ఘనంగా నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్ జ్యోతిరావు పులే చిత్ర పటానికి పుల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రి భాయి పులే ను మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది సామాజిక మార్పు కోసం కృషి చేశారన్నారు. సమ సమాజ స్థాపన విద్యతోనే సాధ్యమని విద్యా వ్యాప్తికి కృషి చేశారని బలహీన వర్గాలు విద్య, ఉద్యోగాల్లో సముచిత స్థానం కల్పిస్తే తమ హక్కులు పొందుతారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ల అమలుకు చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు.

బలహీన వర్గాల ప్రజలకు 29 శాతం నుండి 40 శాతం కు రిజర్వేషన్లు పెంచాలని, జ్యోతి రావు పులే  పేరిట పాఠశాల  ఏర్పాటు చేసినా కనీస సౌకర్యలు కల్పించడం లేదన్నారు. జ్యోతి రావు పులే కు నివాళులు అర్పించడంమే కాకుండా ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా బలహీన వర్గాలు, దళితులు, అల్పసంఖ్యాక ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. తెలంగాణలోని బలహీన వర్గాల అభివృద్ధికి  చట్టాలు అమలు చేస్తామని మరిచారని, జ్యోతి రావు పులే  పాఠశాలల్లో ఒక్కటి పక్కా భవనం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు.  ఉమ్మడి రాష్ట్రంలో కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూల్ కు పక్క భవనాలు నిర్మించామాని, అల్లిపుర్ జ్యోతి రావు పులే పాఠశాల కరీంనగర్ లో నిర్వహించడం సరికాదన్నారు.

ఈకార్యక్రమంలో పిసిసి సభ్యుడు గిరి నాగభూషణం, కొత్త మోహన్, బండ శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లే పల్లి దుర్గయ్య, పులి రాము, వీరబత్తిని శ్రీనివాస్, పుప్పాల అశోక్,  నక్క జీవన్, కొంద్ర జగన్, చందా రాధా కిషన్, గుంటి  జగదీశ్వర్, పిసిసి ఎన్ ఆర్ ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా, కోర్టు శ్రీను, కమల్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ సునీత నరేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు, మైనారిటీ సెల్ పట్టణ అద్యక్షుడు నేహాల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు, బీరం రాజేష్, రియాజ్, లైసెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు.