రామన్నపేటను కరువు మండలంగా ప్రకటించాలి..

రామన్నపేటను కరువు మండలంగా ప్రకటించాలి..
  • రామన్నపేటను కరువు మండలంగా ప్రకటించాలి..
  • కరువుతో ఎండుతున్న వరి పంటలను అధికారులు పరిశీలించాలి...
  • పంట నష్టాన్ని అంచనావేసి రైతులను ఆదుకోవాలి..
  • సిపియం ఆద్వర్యంలో తహసిల్థార్ కు వినతి

రామన్నపేట, ముద్ర : రామన్నపేట మండలంను కరువు మండలంగా ప్రకటించి నీరు లేక ఎండిన వరి పంటలు పరిశీలించి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపియం జిల్లా కమిటి సభ్యులు జల్లెల పెంటయ్య,మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. సిపియం మండల కమిటి ఆద్వర్యంలో స్థానిక తహసీల్థార్ లాల్ బహదూర్ కు వినతిపత్రం అందజేసి అనంతరం మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరగడంతో భూగర్బజలాల నీటిమట్టం తగ్గడంతో బోర్లు,బావులల్లో నీటి సామర్థం తగ్గింది. ఆరుగాలం కష్టపడి అప్పులు తెచ్చి వేసిన వరిపంట ఎండిపోవడంతో రైతులకు దిక్కు తోచని పరిస్థితి నెలకొన్నదన్నారు.

పంటలు ఎండి పశువులకు గాసంగా మారుతుంటే వ్యవసాయ అధికారులు కనీస క్షేత్రస్థాయి పరిశీలన చేయడంలేదన్నారు. దర్మారెడ్డిపల్లి,పిలాయిపల్లి కాల్వలద్వారా నీరందించి భుగర్బజలం నీటిమట్టం సామర్థ్యాన్ని పెంచాలన్నారు. వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనావేసి ప్రతీ ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం అందించి రామన్నపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని అన్నారు. రైతుల సమస్యపై ప్రభుత్వ అధికారులు స్పందించకుంటే సిపియం ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం  మండల కార్యదర్శి బోయిని ఆనంద్,వైస్ యంపిపి నాగటి ఉపేందర్,మండల నాయకులు బల్గూరి అంజయ్య,గాదె నరేందర్,కల్లూరి నగేష్,కందుల హనుమంతు,బావండ్లపల్లి బాలరాజు,పిట్టల శ్రీనివాస్  పాల్గొన్నారు.