సంగీత సరస్వతీ  ఇళయరాజా నిలయం

సంగీత సరస్వతీ  ఇళయరాజా నిలయం


ఇళయరాజా చాలా సినిమాలకు మ్యూజిక్ చేస్తూ బిజీగా వున్నాడు. ఇద్దరు నిర్మాతలు వచ్చి సాంగ్ రికార్డింగ్​కు డేట్లు ఇవ్వమని అడుగుతున్నారు. ఇంతలో వంశీ అదే పని మీద అక్కడికి వచ్చాడు - 'మాకే డేట్ ఇవ్వట్లేదు, ఇప్పుడే వచ్చిన ' మీకేం ఇస్తాడు' అన్నారు. అప్పుడు వంశీ 'ఆయన 5 నిమిషాలు కూర్చుంటే చాలు నా ట్యూన్ వచ్చేస్తుంది' - అన్నాడు. ఆ మాటలు విన్న ఇళయరాజా 'చూసారా వాడి కాన్ఫిడెన్స్​, అందుకే వాడికి పాటలు తొందరగా వస్తాయి' అన్నాడు. అలాగే వంశీ 2 సినిమాల్లో పాటలు వైవిధ్యంగా, మేలోడియస్​గా వుంటాయి. ఇళయరాజా సంగీత మేధావి. ఘంటసాల గారి ఇల్లు కావాలని కొనుక్కున్నాడు. ఆ ఇంటికి వెళితే అది ఒక సంగీత సరస్వతీ నిలయంలా వుంటుంది.