పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు అవిశ్వాసం గండం తప్పదా...?

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు అవిశ్వాసం గండం తప్పదా...?
  • పుట్ట మధును పదవి నుంచి తొలగించడానికి జిల్లాలో రహస్యంగా జడ్పిటిసి ల సంతకాల సేకరణ
  • జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశానికి నిన్న మెజార్టీ జెడ్పిటిసిలు డుమ్మా
  • జిల్లాలో రహస్యంగా సమావేశం అయి క్యాంపుకు తరలిపోయిన జడ్పిటిసిలు...?
  • నేడు జరగనున్న సర్వసభ్య సమావేశం కొనసాగినా...?

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కు అవిశ్వాసం గండం తప్పదా... అంటే తప్పదు అనిపిస్తుంది. ఆయన పదవికి గండం పొంచి ఉన్నట్లే కనిపిస్తుంది... 

దీంతో జిల్లాలో రాజకీ ఒక్కసారిగా వేడెక్కనుంది బుధవారం జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశం అధికారులు ఏర్పాటు చేయగా, కేవలం ఇద్దరి జడ్పిటిసిలు మాత్రమే హాజరు కాగా, మేజర్టీ జడ్పీటీసీలు డుమ్మా కొట్టారు. దీంతో జడ్పీ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకే జిల్లాలోని జడ్పిటిసిలు హాజరు కాకుండా రహస్యంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తుంది. గత నెల 28న జరగాల్సిన జడ్పీ మీటింగ్ కూడా వాయిదా పడడంతో పాటు బుధవారం స్టాండింగ్ కమిటీ కి హాజరుకాని జట్పీటీసీలు నేడు జరగనున్న జడ్పీ సమావేశానికి హాజరవుతారా... అనే అనుమానం వ్యక్తం అవుతుంది. పుట్ట మధు పై అసంతృప్తిగా ఉన్న జడ్పిటిసిలు అవిశ్వాసం పెట్టేందుకే ముగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఏకంగా మధు పై అవిశ్వాసం పెట్టాలని మెజార్టీ జడ్పిటిసి లు సంతకాల సేకరణ చేసి క్యాంపుకు కూడా తరలి పోతున్నారని సమాచారం. 2019 లో జరిగిన ఎన్నికల్లో పెద్దపెల్లి జిల్లాలో 13 మండలాలలో బీఆర్ఎస్ పార్టీ 11 మంది జడ్పిటిసిలను గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ రెండు జడ్పీటీసీలను గెలుచుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి బీఆర్ఎస్ పార్టీ ని వీడి బిజెపి పార్టీలో చేరారు. ఓదెల జడ్పిటిసి గంట రాములు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో మధు పైన అసంతృప్తిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీలు అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ సమీకరణలో చైర్మన్ పదవీ నుంచి ఎలాగైనా ఆయనను తప్పించాలని మెజార్టీ జడ్పిటిసి లు రహస్యంగా సమావేశం అవుతూ పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పిటిసి లే పుట్ట కు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో పుట్ట కు అవిశ్వాస గండం తప్పేటట్లు కనిపించడం లేదు. దీంతో పెద్దపెల్లి జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి.