ఆగస్ట్ 18న ‘స్కంద’ సెకండ్ సింగల్

ఆగస్ట్ 18న ‘స్కంద’ సెకండ్ సింగల్

బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘స్కంద- ది ఎటాకర్‌’ రూపొందిస్తున్నారు. మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టైటిల్‌ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించగా, థమన్ స్కోర్ చేసిన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో ఉంది. ఇప్పుడు స్కంద సెకండ్ సింగల్ అప్​డేట్ ఇచ్చారు మేకర్స్. ఆగస్ట్ 18న స్కంద సెకండ్ సింగిల్ గందారబాయ్ ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ శ్రీలీల పార్టీ వేర్ లో కలర్ ఫుల్ గా కనిపించారు.  శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు.