పెండింగ్ కేసుల పై ప్రతేక దృష్టి సారించాలి 

పెండింగ్ కేసుల పై ప్రతేక దృష్టి సారించాలి 

మత్తు పదార్థాలనివారణకు ప్రత్యెక చర్యలు 
జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలనివారణకు ప్రత్యెక చర్యలు తిసుకుతున్నట్లు తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేర విచారణ మరింత సమర్ధవంతంగా, అన్ని స్థాయిలలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ముందుకు సాగాలని అన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఎస్పీ లు, సి.ఐ లు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లలో నమోదైన వివిధ రకాల కేసులు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్.ఐలకు కేసుల దర్యాప్తు కు సంభందించి  సూచనలు ఇవ్వాలని సూచించారు.

పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయధికారులతో సమన్వయం పాటిస్తూ భాదితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై  నిఘా ఉంచాలని  వారి పై కేస్ లు  నమోదు చేయాలని అన్నారు. రాష్ట్ర, జిల్లాల  సరిహద్దుల నుండి  వచ్చే గంజాయి, సరఫరా చేసే వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి రవాణా ను  పకడ్బందీగా నియంత్రించాలన్నారు. జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహించాలని అన్నారు.  జిల్లాకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రానీయకుండా పకడ్బందీగా చెక్ పోస్టు ల నిర్వహణ ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఎఎస్పి శివం ఉపాధ్యాయ, డీఎస్పీలు రఘు చందర్, ఉమామహేశ్వర రావు, రంగా రెడ్డి, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ,నాగేశ్వర రావు, రఫీక్ ఖాన్, మరియు సి.ఐ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.