డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు

హుస్నాబాద్ ముద్ర న్యూస్:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  వర్ధంతిని బుధవారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించారన్నారు. ఈ వర్గాలు రాజకీయపరంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లి సమ సమాజ నిర్మాణం చేపట్టిన రోజే ఆ మహనీయునికి నిజమైన నివాళులర్పించిన వారిమైతమన్నారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, మాజీ ఎంపిటిసి ఎండీ హసన్, మున్సిపల్ కౌన్సిలర్ వల్లపు రాజు తదితరులు పాల్గొన్నారు.