యాక్షన్ తో కూడిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ టక్కర్: హీరో సిద్ధార్థ్

యాక్షన్ తో కూడిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ టక్కర్: హీరో సిద్ధార్థ్

* నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 'టక్కర్'. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇందులో భాగంగా "టక్కర్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్ మరియు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా....

లెజండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ...

విశ్వప్రసాద్ గారు , వివేక్ గారు నాకు మంచి ఫ్రెండ్స్, సిద్దార్థ్ నాకు చాలా కాలం నుండి మంచి ఫ్రెండ్. ఐ విష్ హిమ్ అల్ ద బెస్ట్. బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్ అందరు నాకు మంచి ఫ్రెండ్స్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ....

ఇక్కడికి రావడం చాలా హ్యాపీ గా ఉంది. సిద్దార్థ్ గారు ఈ జనరేషన్ కమల్ హాసన్ లా అనిపిస్తారు. సిద్దార్థ్ అప్పటికి ఇప్పటికి అలానే ఉన్నారు. ట్రైలర్ చాలా బాగుంది, తప్పకుండా సినిమా థియేటర్ కి వెళ్లి చూద్దాం.

దర్శకుడు కార్తీక్ జి. క్రిష్ మాట్లాడుతూ....

ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి , టీజీ విశ్వప్రసాద్ , వివేక్ గారికి అందరికి నమస్కారం. ఈ సినిమాలో యూనివర్సల్ కంటెంట్ ఉంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి మూడు కారణాలు, మొదటది మీ సిద్దార్ధ్ , తరువాత దివ్యాంశ. మా గురువు గారు శంకర్ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడే అదే బాటలో శిష్యుడు సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ కాలానికి ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుంది. ఈ సినిమాను థియేటర్ లో చూసి ఎంకరేజ్ చెయ్యండి.