రాజన్నను దర్శించుకున్న మార్క్ ఫైడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగరెడ్డి

రాజన్నను దర్శించుకున్న మార్క్ ఫైడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగరెడ్డి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని మార్క్ ఫైడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగరెడ్డి, సతిసమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడెమోక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. వీరి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, అశోక్, వేములవాడ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, కోనరావుపేట మండల సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్య యాదవ్, కోరేం సింగిల్ విండో చైర్మన్ టి కిషన్ రెడ్డి, కొలనూరుసింగిల్ విండో చైర్మన్ సంకినేని రామ్ మోహన్ రావు,తదితరులు ఉన్నారు.