పూజా కార్యక్రమాలతో.. "ఉద్యమ కెరటాలు"

పూజా కార్యక్రమాలతో.. "ఉద్యమ కెరటాలు"

ఈ చిత్రంలో హీరో గా చందు రాగం హీరోయిన్ గా హాసిని మరియు ప్రీతి సుందర్, నటిస్తున్నారు.. ఈ చిత్రం పూజ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది...ముఖ్య అతిథిగా కాసర్ల శ్యామ్...యూనిట్ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు... ఈ సందర్భంగా కాసర్ల శ్యామ్ గారు మాట్లాడుతూ గోరేటి వెంకన్న గారితో కలిసి పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నాను... సంగీత దర్శకుడు బోలె షావలి గారు మాట్లాడుతూ తెలంగాణ  ఉద్యమానికి సంబంధించిన సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేయడం నాకు గర్వంగా భావించి ఈ సినిమాకి మంచి పాటలు అందిస్తానని చెప్పడం జరిగింది. హీరో చందు రాగం గారు మాట్లాడుతూ ఇలాంటి చారిత్రాత్మక సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్  పిడమర్తి రవీంద్ర గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను  అన్నారు.