‘వృషభ’ ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌ లాంఛ్‌

‘వృషభ’ ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌ లాంఛ్‌


వి.కె.మూవీస్‌ పతాకంపై అశ్విన్‌ కామరాజ్‌ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వృషభ’. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్‌, అలేఖ్య హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌, పోస్టర్‌లాంచ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గౌతమ్‌రాజు తనయుడు హీరో కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సి. కల్యాణ్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.  అనంతరం సి. కల్యాణ్‌ మాట్లాడుతూ... ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. దర్శక, నిర్మాతలు శివుణ్ణి నమ్ముకున్నారు. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆయన మిమ్మల్ని కరుణించి మీకు మంచి లాభాలు, పేరు తెచ్చిపెట్టాలి. ఈ సినిమాలో శివుడి పాత్ర చాలా ఉన్నట్టుగా ట్రైలర్‌ చూస్తే అనిపిస్తోంది. మంచి ఎమోషన్‌ ఉంది. చక్కటి లొకేషన్స్‌లో రిస్క్‌ అయినా లెక్కచేయకుండా చేసినట్లు ట్రైలర్‌ చూస్తే అర్ధమౌతోంది. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి భవిష్యత్తులో నిర్మాతగా, కథకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. ప్రముఖ నిర్మాత, సంతోషం అధినేత సురేష్‌ కొండేటి మాట్లాడుతూ...ఈ టైటిల్‌ నాకు చెప్పగానే అద్భుతంగా ఉంది అన్నాను. కొన్ని సినిమాల ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌లు చూడగానే ఈ సినిమా సక్సెస్‌ అవుతుంది అని చెప్పేయవచ్చు అన్నారు.