గంగుల నీ వీడియోలు బయట పెడితే తట్టుకోలేవ్

గంగుల నీ వీడియోలు బయట పెడితే తట్టుకోలేవ్
  • చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు జాగ్రత్త
  • బిజెపి కార్యకర్తలే నా హీరోలు
  • పోలింగ్ ముగిసేవరకు అప్రమత్తంగా ఉండండి
  • బీఆర్ఎస్ నేతలు డబ్బు పంచె పనిలో పడ్డారు
  • డబ్బులు పంచితే లాక్కొని పేదలకు పంచండి
  • కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :గంగుల నీ వీడియోలు, చాటింగ్ లు బయట పెడితే తట్టుకోలేవ్ జాగ్రత్త అంటూ కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ హెచ్చరించారు. అవి ప్రజల ముందు ఉంచితే చరిత్రహీనుడుగా మిగిలిపోతావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.నా బిజెపి కార్యకర్తలే నా హీరోలు అని, విజయం ముద్దాడే వరకు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ లో మహా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రారంభ ఉపన్యాసం చేయగా రేకుర్తిలో ముగింపు సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అభివృద్ధిపై నేరుగా నాతో చర్చించే దమ్ములేక గంగుల కమలాకర్ నాపై దొంగ వీడియోలు సృష్టించేందుకు సిద్దమైనట్లు సమాచారమొచ్చింది. ఖబడ్దార్ నేను తలుచుకుంటే నువ్వు బయట తిరగలేవ్ దొంగ వీడియోలు సృష్టిస్తే చరిత్ర హీనుడిగా మారతావ్’’ అంటూ  హెచ్చరించారు. కనివినీ ఎరగని రీతిలో ఈ ర్యాలీకి ప్రజలు తరలివచ్చారు. మహిళలు, ముస్లిం మహిళలు సైతం ఈ ర్యాలీలో పాల్గొని బండి సంజయ్ కు సంఘీభావం ప్రకటించారు.మరోవైపు కిసాన్ నగర్ లోని మైత్రి కన్వెన్షన్ నుండి ప్రారంభమైన మహా బైక్ ర్యాలీ, గాంధీ చౌక్, రాజీవ్ గాంధీ విగ్రహం, టవర్ సర్కిల్, శాస్త్రీ రోడ్, కమాన్, ఎన్టీఆర్ విగ్రహం, గణేష్ నగర్ బైపాస్, అంబేద్కర్ స్టేడియం, భగత్ సింగ్ విగ్రహం, గోదాం గడ్డ, వుమెన్స్ కాలేజ్, రాంనగర్ మార్క్ ఫెడ్, మంకమ్మ తోట, హనుమాన్ టెంపుల్, శివ థియేటర్, కెమిస్ట్రీ భవన్, జగిత్యాల రోడ్, అంబేద్కర్ విగ్రహం మీదుగా రేకుర్తి వరకు కొనసాగింది.

మీరే నా హీరోలు మీ కష్టం, ప్రజల ఆశీర్వాదంతో కరీంనగర్ లో భారీ మెజారిటీతో బీజేపీతో విజయం సాధించబోతున్నం. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కొట్లాడినం. నిరుద్యోగుల, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, రైతులు, విద్యార్టులు, మహిళలలుసహా అన్ని వర్గాల ప్రజల పక్షాన కొట్లాడినం అన్నారు . అందుకే ప్రజలంతా బీజేపీ వైపు నిలబడ్డారని స్పష్టం చేశారు.నేను తలుచుకుంటే నీ వీడియోలు,  నీ ఛాటింగ్ లు ఇంటింటికీ చూపెట్టగలను. ఎల్లుండి పోలింగ్ సమయానికి కూడా అవి చూసిన కేసీఆర్, కేటీఆర్ లు నీకు ఫోన్ చేసి పోటీ నుండి తప్పుకోవాలని చెబుతారు. అంతదాకా చేసుకోవద్దు నేను వీడియో, ఛాటింగ్ లు బయట పెడితే నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అది కావొద్దని కోరుకుంటున్న. నీకు దమ్ముంటే నాతో నేరుగా కొట్లాడు అభివృద్ధిపై కొట్లాడు తేల్చుకుందాం అన్నారు.

అంతేగానీ నీ భూకబ్జాలు, రౌడీయిజం నా దగ్గర చెల్లవు మా బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు తట్టుకోలేవు నా సహనాన్ని పరీక్షించొద్దు. ఒక్కసారి రాజకీయాలను పక్కనపెడితే ఒక్కొక్కరి అంతు చూసేదాకా వదిలిపెట్టను అంతేతప్ప ఫ్రస్టేషన్ లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే పరిస్థితే లేదని హెచ్చరించారు. ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన అఫ్ట్రాల్ నువ్వెంత? ఖబడ్దార్ నీ దగ్గర కిరాయి పైసలు తీసుకుని పనిచేసే వాళ్లే ఉన్నరు. కానీ నా దగ్గరున్నోళ్లంతా వీరులే పైసలతో పనిలేకుండా పార్టీ కోసం దేనికైనా తెగించేటోళ్లే హద్దు దాటితే తట్టుకోలేవ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు కోట్ల కోసం డబ్బులు పంచే పనులు పడ్డారు. మీ దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీరే వాళ్ల దగ్గరున్న డబ్బులన్నీ గుంజుకోండి పేదలకు పంచి పెట్టండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ తో పాటు పలువురు కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.