కెసిఆర్ పాలనలో...

కెసిఆర్ పాలనలో...
  • సంక్షేమ ఫలాల స్వర్ణ యుగం
  • దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సంక్షేమ ఫలాల స్వర్ణ యుగంలా సాగుతుందని రాష్ట్ర దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఈ ఆర్ ఎల్ గార్డెన్ లో జరిగింది.వడకం ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షణం అన్నారు. ఈ పదేళ్ల కాలంలో దివ్యాంగుల పెన్షన్ల కోసం రూ.10 వేల 300 కోట్లు ఖర్చు చేసిందన్నారు. గత పాలకులు సంక్షేమాన్ని విస్మరిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం మానవత్వంతో వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. రూ.500 నుండి రూ.3016 కు పెంచడమే కాకుండా రూ.6016 పెంచే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం అన్నారు. 

" ఉగాది నుండి 5016 లు"

కడియం శ్రీహరి: వచ్చే ఉగాది నుండి వికలాంగుల పెన్షన్ రూ.5016లు ఇస్తామని టిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రంలో ఎక్కడ దివ్యాంగుల పెన్షన్ పెంచింది లేదన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్, రాజస్థాన్ లో రూ.1000 దాటలేదన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని వికలాంగుల భవనాన్ని నిర్మిస్తామని శ్రీహరి హామీ ఇచ్చారు. రాష్ట్ర రాష్ట్ర బడ్జెట్లో సగం సంక్షేమ రంగానికి కేటాయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరో మారు గెలిపించుకోవాలని అందుకు మీ ఆశీర్వాదం అవసరం అన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ మున్నా, చల్ల సుధీర్ రెడ్డి, దామర రమేష్, గంట లక్ష్మి, దీకొండ నరేష్, వాటాల యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, బడికి కుమారస్వామి, దామెర మంగ, మల్లేష్, లక్ష్మణ్, వీరస్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.