హాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ మృతి

హాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ మృతి

బ‌రువు త‌గ్గడం కోసం లైపో స‌క్సన్ ను.. ముఖం అందం పెంచుకోవ‌డానికి ప్లాస్టిక్ స‌ర్జరీలను రెగ్యుల‌ర్ గా తార‌లు ఆశ్రయించడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఒక్కోసారి చికిత్స విక‌టించి ప్రాణాలు కోల్పోయిన తార‌లు కూడా ఉన్నారనే చెప్పాలి. అందాల క‌థానాయిక‌ ఆర్తిఅగ‌ర్వాల్ ఇంత‌కుముందు లైపో చికిత్స విక‌టించ‌డం వ‌ల్లనే మ‌ర‌ణించింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ప‌లువురు తార‌లు ముఖాకృతి చికిత్సలు విక‌టించి వికృతంగా మారిన సంద‌ర్భాలున్నాయి. ఇప్పుడు కాస్మొటిక్ స‌ర్జరీ కార‌ణంగా ప్రముఖ న‌టి మృతిచెందడం సంచ‌ల‌న‌మైంది. పాపుల‌ర్ హాలీవుడ్ న‌టి జాక్వెలిన్ క్యారీరీ ఆస్పత్రిలో కాస్మెటిక్ సర్జరీ కారణంగా మృతిచెందింది. ఆమె మృతికి కారణం రక్తం గడ్డకట్టడం అని తేలింది. 48 సంవత్సరాల వయస్సులో ఆమె మ‌ర‌ణం అభిమానుల‌కు బిగ్ షాక్. అర్జెంటీనా మాజీ అందాల భామగా నటి జాక్వెలిన్ క్యారీరీ సుప‌రిచితురాలు. లాటిన్ అమెరికన్ సినిమా స్టార్ గా త‌న‌కు పెద్ద పేరే ఉంది. మోడల్ కం, నటి జాక్వెలిన్ కాలిఫోర్నియాలో మృతిచెందిందని తెలియ‌గానే అభిమానులు షాక్ కి గుర‌య్యారు. అర్జెంటీనా మీడియా నివేదికల ప్రకారం జాక్వెలిన్ తుది శ్వాస విడిచినప్పుడు ఆమె పిల్లలు క్లో, జూలియన్ త‌న‌ పక్కనే ఉన్నారు.