'రాజా రమ్యం' సినిమా నుంచి 'పోరా పోరా పోరగాడా..' లిరికల్ సాంగ్ రిలీజ్

'రాజా రమ్యం' సినిమా నుంచి 'పోరా పోరా పోరగాడా..' లిరికల్ సాంగ్ రిలీజ్

విగ్నేష్ రెడ్డి గవి, శ్రీ ఆశ్రిత జంటగా నటిస్తున్న సినిమా 'రాజా రమ్యం'. విలేజ్ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రనిల్ గౌరీ పాగ రూపొందిస్తున్నారు. గావి ఫిలిమ్స్, సిల్లీ  మాంక్స్ స్టూడియోస్ పై  కోకొండ జయచందర్ రెడ్డి, సంజయ్ రెడ్డి మరియు అనిల్ పల్లాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా పోరా పోరా పోరగాడా అనే లిరికల్ సాంగ్ ను బలగం చిత్ర దర్శకుడు వేణు యెల్దండి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వేణు యెల్దండి మాట్లాడుతూ - ప్రనీల్ గౌరీ దర్శకుడిగా ఇప్పటికే సినిమా చేయాల్సింది.

సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాలు తెలిసినవే కదా. రాజా రమ్యం సినిమా టైటిల్ బాగుంది. పోరా పోరా పాట రిపీటెడ్ గా వినేలా ఉంది. అంతా కొత్త వాళ్లు చేస్తున్న ప్రయత్నమిది. మీ సపోర్ట్ కావాలి. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నా. అన్నారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించడంతో పాటు స్వరపర్చి దివ్య మల్లికతో కలిసి పాడారు. 'పోరా పోరా పోరగాడా...పెద్ద పోరాటమే గుండె కాడా..అల్లుకున్నావురా మొత్తం ఆడ...అందుకే అయ్యింది ఇంత తేడా..'అంటూ లవ్ ఫీల్ పంచుతూ సాగుతుందీ పాట. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా నుంచి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రాబోతున్నాయి.