‘భోళా శంకర్’ మెగా మాస్ టీజర్ లాంచ్ 

‘భోళా శంకర్’ మెగా మాస్ టీజర్ లాంచ్ 

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ మెగా మాస్ టీజర్ విడుదల
 చిరంజీవి తన వింటేజ్  స్టైలిష్ మాస్ అవతార్‌ లో కనిపించడం ఎప్పుడూ కన్నుల పండువగా ఉంటుంది. దర్శకుడు మెహర్ రమేష్  ‘భోళా శంకర్’ లో చిరంజీవిని పవర్-ప్యాక్డ్ రోల్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ ను లాంచ్ చేశారు. 33 మందిని దారుణంగా చంపిన వ్యక్తి కోసం కోల్‌కతా పోలీసులు వెతుకుతున్నారని చెప్పే వాయిస్‌ ఓవర్‌ తో టీజర్ ప్రారంభమవుతుంది. చిరంజీవి ఇంట్రడక్షన్ సీక్వెన్స్‌ లో తన స్వాగ్, స్టయిల్ తో అదరగొట్టారు.

డెన్‌లో గూండాలను చితకొట్టి  "షికార్ కొచ్చిన షేర్ ని బే..." అని చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా పేలింది. “ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే... అన్ని ఏరియాలు అప్నా హై... నాకు హద్దుల్లేవ్... సరిహద్దుల్లేవ్... 11  ఆగస్ట్ దేఖ్‌లేంగే...” అంటూ మెగాస్టార్ చెప్పిన చివరి డైలాగ్ ప్రేక్షకులని అలరించింది. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. టీజర్‌లో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ పాత్రలను కూడా పరిచయం చేశారు. డడ్లీ తన అద్భుతమైన కెమెరా పనితనంతో ఆకట్టుకున్నారు. మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్స్ టార్డినరిగా వుంది . థీమ్ సాంగ్ పాత్రకు పర్ఫెక్ట్ ఎలివేషన్ ఇస్తుంది. ఓవరాల్ గా టీజర్ ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ.. మెగాస్టార్ గారిలో మనకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో వుంటాయి.  అభిమానులని, ప్రేక్షకులని అందరినీ ఈ సినిమా అలరిస్తుంది. అన్నయ్య సంక్రాంతి కి వాల్తేరు వీరయ్యగా వచ్చారు. ఆగస్ట్ 11న మనం మళ్ళీ మెగా ఫెస్టివల్ చేసుకుంటాం.  ఈ సినిమా విడుదలే మనకి పండగ. నిర్మాత అనిల్ సుంకర గారితో పాటు అందరం మెగాస్టార్ గారికి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలని ప్రేమతో కష్టపడ్డాం. ఆయన వేగాన్ని అందుకోవడం మనకి కష్టం. ఆగస్ట్ 11న థియేటర్ లో కలుద్దాం. ఇక నుంచి మెగా సెలబ్రేషన్స్ , భోళా మానియా బిగిన్. అభిమానుల్లో నుంచి వచ్చి దర్శకుడైన నేను మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తానని నమ్మకంతో చెబుతున్నాను’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. టీజర్ అదిరిపోయింది. సినిమా దీనికి మించి వుంటుంది. ఆగస్ట్ 11న సినిమా వస్తోంది. చిరంజీవి గారి కెరీర్ లో ఈ సినిమా నెంబర్ 1 అవుతుందని బలంగా నమ్ముతున్నాను’’ అన్నారు. మార్తాండ్ కె వెంకటేష్ మాట్లాడుతూ.. చిరంజీవి గారి నుంచి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. అది వందశాతం చెబుతున్నాం'' అన్నారు.