Adipurush Pre Release Event: యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్

Adipurush Pre Release Event: యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్

 భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. అది మరేదో సినిమాకి కాదు ప్రభాస్ హీరోగా చేస్తున్న ఒక ఐదు నిమిషాలు ఆది పురుష్ కి. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలి కాలంలో జరగనున్న బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిలవబోతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించి ప్రభాస్ మరియు కృతి సనన్ నటించిన ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక విడుదలకు ముందు, మేకర్స్ సినిమా ప్రమోషన్ విషయంలో విపరీతమైన శ్రద్ధ వహిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రమోషన్స్​ని చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాకి ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరెవరో కాదు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు ప్రసిద్ధి చెందిన మత గురువు మరియు యోగి సన్యాసి అయిన చిన జీయర్ స్వామి. ఆయన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యి తన దైవిక ఆశీర్వాదాలను కురిపించనున్నారట.