18న చిరంజీవిగారి ఆశీస్సుల‌తో శ్రీదేవి శోభ‌న్‌బాబు

18న చిరంజీవిగారి ఆశీస్సుల‌తో శ్రీదేవి శోభ‌న్‌బాబు
Sridevi Shobhanbabu with the blessings of Chiranjeevi on 18th

సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో Gold Box Entertainment Banner గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని సుష్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్నారు.

బుధ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. రిలీజ్ ట్రైల‌ర్‌, బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగ‌బాబు, హీరో సంతోష్ శోభ‌న్‌, హీరోయిన్ గౌరి జి.కిష‌న్‌, నిర్మాత‌లు సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ దిమ్మ‌ల ,  భాషా, మొయిన్‌, విజ‌య్ మాస్ట‌ర్‌, డాలీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శ‌ర‌ణ్య పొట్ల‌ నిర్మాత సుస్మిత పిల్ల‌లు స‌మ‌ర‌, సంహిత త‌దిత‌రులు పాల్గొన్నారు.