'ప్రతినిధి 2' షూటింగ్ ప్రారంభం

'ప్రతినిధి 2' షూటింగ్ ప్రారంభం


హీరో నారా రోహిత్ పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి 2' తో గ్రాండ్ గా కమ్ బ్యాక్ ఇస్తున్నారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సక్సెస్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి' సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీగా వస్తున్న ఈ చిత్రానికి “One man will stand again, against all odds” అనేది క్యాప్షన్. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైయింది. హీరో నారా రోహిత్ పై కీలకమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ప్రతినిధి 2 కోసం బిగ్ స్పాన్ వున్న కథను ఎంచుకున్నారు నారా రోహిత్. ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై చాలా  క్యూరియాసిటీ పెంచింది. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.