ఆ పాత మధురం...

ఆ పాత మధురం...
  • సహాయ దర్శకుల మాయాజాలం

చిరంజీవి, మోహన్​బాబు కలిసి నటించిన ఒక చిత్రం  డబ్బింగ్​ దశకు చేరుకుంది. మోహన్​బాబు డబ్బింగ్​అయ్యాక, చిరంజీవి డబ్బింగ్.  నిర్మాతకు టెన్షన్​ మొదలయింది. ఎలాగో మోహన్​బాబు డబ్బింగ్​ పూర్తయింది. ఆ చిత్ర అసిస్టెంట్​ డైరెక్టర్​, మరో కో డైరెక్టర్ అనిల్​కుమార్​ కలిసి డబ్బింగ్​ కండక్ట్​ చేశారు. హడివిడిలో వాళ్ళు మోహన్​బాబు డైలాగ్​ ఒకటి మర్చిపోయారు. దాంతో వాళ్ళకు టెన్షన్​ మొదలయింది. ఆ ఒక్క డైలాగ్​అసిస్టెంట్​ డైరెక్టర్​ గొంతుమార్చి డబ్బింగ్​ చెప్పారు. సరే  సినిమా ఫస్ట్​ కాపీ వచ్చింది. ప్రొజెక్షన్​ వేసినప్పుడు, ఆ డైలాగ్​వచ్చినప్పుడల్లా అనిల్​కుమార్, ఆ అసిస్టెంట్​ డైరెక్టర్​ మొహమెహాలు చూసి నవ్వుకుంటున్నారు. ఒక్కోసారి ఇలా పరిస్థితుల్ని అధిగమించాల్సి ఉంటుంది. ఫ్లోలో వెళ్ళిపోయిన ఆ డైలాగ్​ని ఎవ్వరూ గుర్తుపట్ట లేకపోయారు.