మెగా న్యూ మూవీస్​ అనౌన్స్ మెంట్స్​

మెగా న్యూ మూవీస్​ అనౌన్స్ మెంట్స్​


మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా బర్త్ డేని జరుపుకునే అభిమానులకు ఇది ఒక పండగ లాంటి రోజు. మెగా అభిమానులను మరింత ఆనందపరిచే విధంగా, మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం మెగా156  అనౌన్స్ చేశారు. చిరంజీవి ఖైదీ నంబర్ 150వ చిత్రం నుండి స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్న సుస్మిత కొణిదెల భారీ స్థాయిలో నిర్మించనున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మెగా156 రూపొందనుంది. త్వరలోనే చిత్ర దర్శకుడిని అనౌన్స్ చేస్తారు.

మెగా157 అనౌన్స్ మెంట్ ఇది మీ ఊహకు మించి ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూడాలని ఉత్సాహంగా ఉన్న అభిమానులు ఈ అనౌన్స్ మెంట్ తో మరింత సంతోషిస్తారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక ఫాంటసీ మూవీకి సైన్ చేశారు. తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  సక్సెస్ ఫుల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి. వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న మెగా157 చిరంజీవి కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ చిత్రంగా వుంటుంది.  మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని  అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమాతో వశిష్ట మనకు మెగా మాస్ యూనివర్స్ చూపించబోతున్నారు.