ఆ పాత మధురం...

ఆ పాత మధురం...
  • విల్స్ పవర్ ఆఫ్ హాస్య బ్రహ్మ

జంధ్యాల షూటింగ్‌ జరుగుతుంది.  ఫ్లోర్‌ బయట చెట్టు కింద నలుగురు ఆర్టిస్టులు సిగరెట్లు కాలుస్తూ ఆలోచిస్తున్నారు. ఇంతలో జంధ్యాల వచ్చాడు. ఏమటీ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అడిగాడు. సిగరెట్లు ఎలా మానెయ్యాలా? అని ఆలోచిస్తున్నాం అన్నారు. వారిలో ఒకడు విల్‌ పవర్‌ ఉంటే మానెయ్యొచ్చు అన్నాడు. పిచ్చివాడా! విల్‌ పవర్‌ కన్నా విల్స్‌ పవర్‌ గొప్పటి అంటూ జంధ్యాల విల్స్‌ సిగరెట్‌ వెలిగించాడు. రెండు శ్రీలు ధరించి, రెండు పెగ్గులు బిగించి, రెండు వేళ్ళ మధ్య సిగరెట్‌ సంధించి, రెండు పెదాల మధ్య బంధించి రెండు గుక్కలు తాగి, రెండు రింగులొదిలి, ఆ రింగుల్లోకి చూస్తూ, మహాప్రస్థానాన్ని ప్రస్తావించాడు శ్రీశ్రీ అని అన్నాడు ఒకానొక సభలో ఒక వక్త, పేరు గుర్తులేదు. సిగరెట్‌ గురించి ఇంగ్లీష్‌లో ఒక మంచి వాక్యం ఇలా life is a cigarette. It bigins with flashes and ends with ashes.