సమ్మె బాట పట్టనున్న స్టోన్ క్రషర్స్ యాజమాన్యం

సమ్మె బాట పట్టనున్న స్టోన్ క్రషర్స్ యాజమాన్యం
  • మైనింగ్ అధికారుల వేధింపులకు నిరసనగా బంద్ కు పిలుపు
  • శనివారం నుండి పని చేయని స్టోన్ క్రషర్లు

మైనింగ్ శాఖ అధికారుల వేధింపులకు నిరసనగా తెలంగాణ స్టోన్‌ క్రషర్స్‌ అసోసియేషన్‌ సమ్మెకు పిలుపునించ్చింది. శనివారం నుంచి రాష్ట్రంలో నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.  స్టోన్ క్రషర్ల యజమానులపై అధికారులు వేధింపులకు నిరసనగా ఈ సమ్మె చేపట్టినట్లు అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు ఎం.కమలాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కూన శ్రీనివాస్‌గౌడ్‌ , ఉపాధ్యక్షుడు నందారెడ్డి  తెలిపారు.  ముప్పై ఏళ్ల నుండి లీజు నడుపుకుంటున్న యజమాన్యాలపై అక్రమంగా పెనాల్టీలు వేస్తున్నారని అన్నారు. ఓఆర్ఆర్ ను ఆనుకుని ఇల్లీగల్ గా నడుస్తున్న క్రషర్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

 ఈ స్టోన్ క్రషర్ రంగంపై దాదాపు 50 లక్షల మంది ప్రత్యేక్షంగా , పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని... ఈ సమ్మె వల్ల వారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని , మైనింగ్ శాఖ అధికారుల వేధింపులను నివారించాలని కోరారు. ఈ మేరకు బీబీ నగర్ లోని ఓ కన్వెన్షన్ లో 300 మంది అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమై , ఈ సమ్మె ప్రకటన చేశారు.  ఈ సమ్మె తో రవాణా రంగంతో పాటు నిర్మాణ రంగానికి భవన నిర్మాణ సామగ్రి కొరత ఏర్పడుతుందన్నారు.