ఎన్కౌంటర్ల చరిత్ర శ్రీహరిది

ఎన్కౌంటర్ల చరిత్ర శ్రీహరిది
  • పదేళ్లలో బాగుపడ్డది ఎవరు?
  • కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: టిడిపి లో, బిఆర్ఎస్ లో ప్రభుత్వ హయాంలో ఎన్కౌంటర్లు చేయించిన చరిత్ర శ్రీహరిదని పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో బాగుపడింది ఎవరని కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్, తాటికొండ, జిట్టగూడం తండాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రుణమాఫీ చేసింది, ప్రాజెక్టులు కట్టింది, శ్రీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చి గృహాలకు ఇచ్చే కరెంటుతో దోచుకుంటున్నారన్నారు. బ్రాందీ షాపులతోపాటు, వాడ వాడన బెల్ట్ షాపులు తెరిచి తాగుబోతు తెలంగాణ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కింది అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు లేక ఇబ్బందులు పడుతుంటే కెసిఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని ధ్వజమెత్తారు. 30 ఏళ్ల రాజకీయ జీవితం 15 ఏళ్ల రాజకీయ దర్పంతో కడియం శ్రీహరి నియోజకవర్గానికి ఏమీ ఒరగబెట్టాడు ఎన్కౌంటర్ల చరిత్ర తప్ప అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన గ్యారంటీలను ఆరు నెలలలో అమలు చేసి చూపిస్తామని అన్నారు. నిధులు, నీళ్లు, నియమాకాలు అధికారంలోకి రాగానే అమలు చేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కుందూరు వెంకట్ రెడ్డి, కట్ట మల్లు, దూదిపాల నరేందర్ రెడ్డి, జడ్పిటిసి మారపాక రవి, మార్కు శ్రీనివాస్, ఏలియా, రాజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, చేపూరి చిరంజీవి, గద్దె అనిల్, చేపూరి కుమార్, శ్రీనివాస్ ఆయా గ్రామాల నాయకులు, అనుబంధ సంఘాలు, మహిళలు పాల్గొన్నారు.