చివ్వెంల మండలం లో ఖాళీ అయిన కాంగ్రెస్

చివ్వెంల మండలం లో ఖాళీ అయిన కాంగ్రెస్

బిఆర్ఎస్ లో చేరిన మండల ఉపాధ్యక్షుడు రవి నాయక్, జడ్పిటిసి అభ్యర్థి సురేష్ నాయక్, వందాలాధి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు

ముద్ర చివ్వెంల : సూర్యాపేట లో బీఆర్‌ఎస్‌ ప్రచారం అలుపెరగకుండా సాగుతున్నది.  రాష్ట్ర మంత్రి,అభ్యర్ధి  జగదీష్ రెడ్డి తొ పాటు శ్రేణులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఊరూరా సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తుండగా, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు పోలింగ్ సమీపిస్తున్న కొద్ది బిఆర్ఎస్ లో కి కాంగ్రెస్ ,బిజెపి నేతలు క్యూ కడుతున్నారు. చెరికల  తో చివ్వెంల మండలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయింది.. తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ, సీనియర్ నాయకులు కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రవి నాయక్, కాంగ్రెస్ జడ్పీటిసి అభ్యర్ధి సురేష్ నాయక్ తొ పాటు , బిజేపి నాయకులు రాజేందర్ సురేష్, యాదగిరి సాయికుమార్, గిరి లు జాయిన్ అయ్యారు. వస్త్రం తండాలో బిజేపి  చెందిన వార్డు మెంబర్లు , పెన్పాడు మండలం లింగాల గ్రామానికి చెందిన టిడిపి సిపిఎం పార్టీకి చెందిన యూత్ నాయకులు  అనపంగా సైదులు, జానయ్య ,మట్టయ్య మధు యాదవ్  పవన్ లు బిఆర్ఎస్ చెరారు. ఆత్మకూరు మండలం చెందిన బొప్పారం నుండి  కాంగ్రెస్ నాయకులు రంగయ్య, ప్రతాప్ రెడ్డి,తుమ్మల పెన్ పహాడ్ గ్రామాల నుండి ఉయ్యాల రమేష్ నవీన్ వెంకటేష్, ప్రవీణ్ ,గణేష్, సైదులు , బిఆర్ఎస్ లో చేరగా,  కండువాలు కప్పిన మంత్రి సాదరంగా ఆహ్వానించారు.