రెప్పపాటులో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీస్

రెప్పపాటులో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీస్
  • సకాలంలో స్పందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీను 
  • శభాష్ పోలీస్ అన్న అంటూ  ప్రజలు సలాం

ట్రాఫిక్ పోలీస్ ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. షాద్ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ పడగానే దూసుకు వచ్చిన ఓ వృద్దుడు లారీ కింద పడిపోయాడు. అప్పటికే దీనిని గమనిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీను వెంటనే అక్కడికి వేగంగా వచ్చి లారీని నిలిపివేశారు. స్థానికుల సహాయంతో అప్రమత్తమై వెంటనే అతని పక్కకు లాగేశారు. దీంతో ఆ  వృద్ధుడు  ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకున్నాడు. లేకపోతే ప్రమాదం సంబవించి తీవ్ర గాయాలు జరిగేవి లేదా ప్రాణాలు పోయేవని స్థానికులు తెలిపారు ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనుకు ప్రజలు శభాష్ పోలీస్ అన్న అంటూ  సలాం చేస్తున్నారు.