100 కోట్ల ప్రగతి పనులకు సిద్దిపేటలో శ్రీకారం

100 కోట్ల ప్రగతి పనులకు సిద్దిపేటలో శ్రీకారం

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట దాదాపు 100 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సిద్దిపేటలో గురువారం నాడు రాష్ట్ర మంత్రులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావులు పట్టణం నలుమూలల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 62 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఐటీ టవర్ ను ప్రారంభించారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు బిటి రోడ్ల నిర్మాణ పనులకు కోటిలింగాల గుడి వద్ద మంత్రులు ఇద్దరు శంకుస్థాపన చేశారు.

దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సిద్దిపేట రింగ్ మెయిన్ మంచినీటి పైప్ లైన్ స్థానిక ఇగ్బాల్ మీనార్ వద్ద ప్రారంభించారు. 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్లాటర్ హౌస్ ను సిద్దిపేట పరిధిలోని ఇరుకోడు వద్ద మంత్రులు ప్రారంభించారు దాదాపు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న కప్పలకుంట సుందరీకరణ పనులను పార్కు నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు.