సిద్దిపేటకు రాంగనే బావకి ఫోన్ చేస్తా... మళ్లీ ఏమో చేపట్టినవ్ అని అడుగుతా...

సిద్దిపేటకు రాంగనే బావకి ఫోన్ చేస్తా... మళ్లీ ఏమో చేపట్టినవ్ అని అడుగుతా...

మంత్రి హరీష్ రావు పై కేటీఆర్ సరదా కామెంట్స్

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట నేను సిరిసిల్ల ఎమ్మెల్యేను ...నా కాన్స్టెన్సీకి పోవాలంటే నాకూ ఇదే తోవా... సిద్దిపేట రాంగనే బావకు ( మంత్రి హరీష్ రావు కు ) ఫోన్ కొడతా.. మల్లెము మొదలుపెట్టినవ్ అని అడుగుతానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.గురువారం నాటి సిద్దిపేట పర్యటనలో మంత్రి కేటీఆర్ చాలాచోట్ల మంత్రి హరీష్ రావు పై ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రంలోనే అభివృద్ధిలో సిద్దిపేట నెంబర్ వన్ గా మార్చిన ఘనత హరీష్ రావు దక్కుతుందన్నారు. ఈ అభివృద్ధిని చూసి బావకు ఫోన్ చేసి అప్పుడప్పుడు సరదాగా ఏడిపిస్తానని చెప్పారు.