Kadiyam Kavya - కడియం కావ్య ముందే కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు...

Kadiyam Kavya - కడియం కావ్య ముందే కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు...

ముద్ర,తెలంగాణ:- వరంగల్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ముందే కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. కొత్తగా కాంగ్రెస్‌లోకి వచ్చిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మొదలైన గొడవ.. చిలికి చిలికి గాలివానలా మొదలయింది. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలు, పాత కార్యకర్తలుగా రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం కొట్టుకున్నారు. గొడవ ఎంతకు సద్దుమణగకపోవడంతో కడియం కావ్య మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది.