బిర్యానీ బెడిసి కొట్టిందా?

బిర్యానీ బెడిసి కొట్టిందా?

Nazriya Nazim నజ్రియా నజీమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. Ante Sundaraniki ‘అంటే సుందరానికీ’ అన్న చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ Mollywood beauty మాలీవుడ్​ బ్యూటీ. ఆ సినిమా ఆశించిన రేంజ్ లో హిట్​ కాకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆమె కూడా ఇక్కడ జర్నీని అంత సీరియస్ గా తీసుకుని ప్రయత్నాలు చేయలేదు. మరి తాను సాంధించలేనిది భర్త Fahad Fazil ఫహాద్ ఫాజిల్ సాధిస్తున్నాడని అనుకుందో! ఏమో గానీ ఇక్కడ కెరీర్ వెరీ లైట్ అనేసింది.

 సుందరం రిలీజ్ సమయంలో అమ్మడు నెట్టింట  ఏ రేంజ్లో హల్ చల్ చేసిందో తెలిసిందే.  హైదరాబాద్ సహా తెలుగింట రుచులన్నింటినీ ఆహా..ఓహా అంటూ  పొగిడేసింది. ముఖ్యంగా Hyderabad Biryani is world famous biryani హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ బిర్యానీ అంటూ సర్టిఫై చేసింది. తన ఇంటి ఫుడ్ కూడా ఇంత టేస్ట్ గా ఉండదని ఒకేసారి అన్ని వంటకాలు లాగించేసింది. అప్పుడే అమ్మడు హైదరాబాద్ బిర్యానీ ప్రిపరేషన్ కూడా తెలుసుకుంది. బిర్యానీ ఎలా తయారు చేస్తారు. అందులో వాడే ఇంగ్రిడియన్స్ అన్నీ రాసిపెట్టుకుని  వారం రోజుల క్రితమే అమ్మడు నైట్ డిన్నర్ లో భాగంగా హైదరాబాదీ బిర్యానీ వంటకం ట్రై చేసిందట. ఇక్కడ స్టైల్ కి కావాల్సిన అన్ని రకాల పదార్ధాలు సిద్దం చేసుకుని కొద్ది మొతాదులో  బిర్యానీ వండిందిట. దాదాపు మూడు గంటలు పాటు శ్రమించి బిర్యానీ సిద్దం చేసిందిట. కానీ టేస్ట్ బెడిసి కొట్టిందిట.