బాధ్యతలు చేపట్టిన జిల్లా వైద్యాధికారి  డాక్టర్ వై. పాపారావు 

బాధ్యతలు చేపట్టిన జిల్లా వైద్యాధికారి  డాక్టర్ వై. పాపారావు 

ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా డాక్టర్ వై. పాపారావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సహకారంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉప కేంద్రాల్లో సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

ఈ విషయంలో ఎలాంటి అలసత్వం వహించిన శాఖాపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. వైద్యాధికారులకు, సిబ్బందికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఎం సి హెచ్ కార్యక్రమాలు 100% శాతం జరిగేలా కృషి చేయాలన్నారు. జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉండేలా చూడాలన్నారు. ప్రతి కార్యక్రమం ఆన్లైన్లోనే నమోదు చేసేలా చూడాలన్నారు. జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పీహెచ్ సి లలో, ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవలన్నారు. వడదెబ్బ నిర్వహణపై ఆరోగ్య సిబ్బందికి తగిన శిక్షణ అందించాలన్నారు.