రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన సీఎం : బిఆర్ఎస్ వై రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ.

రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన సీఎం : బిఆర్ఎస్ వై రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ.

ముద్ర,చౌటుప్పల్:- డిసెంబరు 9 నా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక రుణమాఫీ పై మౌనం పాటిస్తున్నారని,ఎన్నికల హామీని అమలు చేయాలని, రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే ప్రకటన విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ఉప్పు కృష్ణ డిమాండ్ చేశారు.వారు మాట్లాడుతూ చాలామంది రైతులు పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చారని అవి సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారని నోటీసులు పంపడం, ఇండ్ల మీదికి అధికారులను పంపడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని రైతులు భయాందోళన పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,రెండు లక్షల రూపాయల రుణమాఫీని నీటిలో ముంచి రైతులను నయవంచనకు గురి చేశారని ఆరోపించారు.తక్షణమే రెండు లక్షల రుణమాఫీపై ప్రకటన చేయాలని అదే విధంగా బ్యాంకర్లు రైతుల జోలికి వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా బోనస్ రూ.500 ఇస్తామని ఎన్నికల హామీలో ప్రకటన చేశారని. ఈ పంట నుంచి దాన్ని వర్తింపచేయాలని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కొనుగోలు కేంద్రాలలో మంచినీటి సౌకర్యం, చలువపందిళ్లు,వేయాలని డిమాండ్ చేశారు.