మానసా ఎక్స్లెన్స్ స్కూల్ లో అధునాతన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన డిఈఓ 

మానసా ఎక్స్లెన్స్ స్కూల్ లో అధునాతన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన డిఈఓ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని మానస ఎక్స్లెన్స్ స్కూల్ నూతన భవనం లో ప్రత్యేకంగా నిర్మించిన అత్యధిక అధునాతన టెక్నాలజీతో  సకల సౌకర్యాలతో ప్రత్యేకంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను జగిత్యాల జిల్లా విద్యాధికారి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఇఓ జగన్మోహన్ రెడ్డి  మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను తప్పనిసరి కలిగి ఉండాలని, సైన్స్ అంటే ప్రయోగాలు చేయడమని విద్యార్థులు సిద్ధాంత పరంగా మౌఖికంగా నేర్చుకున్న దానికంటే ప్రయోగాత్మకంగా చేస్తూ నేర్చుకున్న జ్ఞానం శాశ్వతం అన్నారు. అలా నేర్చుకున్నప్పుడే నిజ జీవితంలో అన్వయించగల్గుతారన్నారు.

విద్యార్థులు ప్రయోగాలు చేసినప్పుడే పరిపూర్ణ జ్ఞానం పొందగలుగుతారని, విద్యార్థులు నూటికి నూరు శాతం ఈ ప్రయోగశాలను ఉపయోగించుకునేలా సైన్స్ ఉపాద్యాయులు వారిని ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా అధునాతన సైన్స్ ల్యాబ్ ని  సమకూర్చిన సందర్భంగా పాఠశాల డిఇఓ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బి.శ్రీనివాస్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు, డైరెక్టర్లు హరిచరణ్ రావు, మౌనికరావు, ప్రిన్సిపాల్ రజితా రావు,  ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.