ఉదయ్​ కుమార్​ రెడ్డికి బెయిల్​ ఇవ్వొద్దు: సీబీఐ 

ఉదయ్​ కుమార్​ రెడ్డికి బెయిల్​ ఇవ్వొద్దు: సీబీఐ 

వైఎస్​ వివేకా హత్య కేసులో ఉదయ్​ కుమార్​ రెడ్డి బెయిల్​ పిటిషన్​పై  సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి.  వివేకా హత్య కేసు డైరీని సీబీఐ కోర్టుకు సమర్పించింది. ఉదయ్​ కుమార్​ రెడ్డికి బెయిల్​ ఇవ్వొద్దని కోరింది. బెయిల్​ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది. ఆధారాలు సేకరించిన తరువాతే ఉదయ్​ని అరెస్టు చేశామని తెలిపింది. ఎంపీ అవినాశ్​ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ తన కౌంటరులో పునరుద్ఘాటించింది. వివేకా హత్య, సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్​ ప్రమేయం ఉందని సీబీఐ చెప్పింది. ఉదయ్​ కుమార్​ రెడ్డి బెయిల్​ పిటిషన్​పై ఉత్తర్వులను ఈ నెల 15 కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.